బాలీవుడ్ నటుడు బాబ్ క్రిస్టో మృతి
బెంగళూరు,మార్చి 21: : బాలీవుడ్ నటుడు, విలన్ బాబ్ క్రిస్టో గుండెపోటుతో ఆదివారం బెంగళూరులో మరణించారు. ఆయన వయస్సు 72 సంవత్సరాలు. జన్మత ఆస్ట్రేలియాకు చెందిన బాబ్‌క్రిస్టో తొలిసారిగా బాలీవుడ్ నటుడు సంజయ్ ఖాన్ నిర్మించిన అబ్దుల్లా చిత్రం ద్వారా1980 సంవత్సరంలో హిందీ చిత్రసీమకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి ఖుర్భానీ, సర్ఫరోష్, కిస్మత్, గుమ్‌రాహ్, రూప్ కి రాణి చోరోంకా రాజా, అగ్నిపత్, మిస్టర్ ఇండియా చిత్రాలతోపాటు దాదాపు 200 చిత్రాల్లో నటించారు. గత కొద్దికాలంగా చిత్రసీమకు దూరమయ్యారు. ఆయన బెంగళూరులో స్థిర నివాసమేర్పరుచుకున్నారు.
Comments