తిరుమలలో తెప్పోత్సవాలు ప్రారంభం
తిరుమల,మార్చి 15: శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తెప్పోత్సవాలు తిరుమలలో మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. తొలి రోజు స్వామి వారు శ్రీరామచంద్ర అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పుష్కరిణిలో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. విద్యుత్ దీపాల అలంకరణతో తిరుమల ఆలయం శోభిల్లుతోంది. గోవిందనామ స్మరణతో తిరుమల గిరులు మారుమ్మోగుతున్నాయి.

Comments