మాజీమంత్రి కలిదిండి రామచంద్రరాజు మృతి
హైదరాబద్,జులై 30: పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ నేత, మాజీ మంత్రి కలిదండి రామచంద్రరాజు సోమవారం సాయంత్రం బీమవరం లో మృతి చెందారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో రామచంద్రరాజు భాదపడుతున్నారు. భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు బంధువులు తెలిపారు. 1983 నుంచి 2004 సంవత్సర కాలంలో ఆయన ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా సేవలందించారు.
Comments