సెక్సీ కత్రినా...!
ముంబై,జులై 5: ప్రముఖ బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ వరుసగా నాలుగోసారి ప్రపంచ శృంగార తార (సెక్సీయస్ట్ ఉమెన్) గా ఎంపికయింది. ఎఫ్‌హెచ్‌ఎం మేగజైన్ పూర్తిగా ఆన్‌లైన్, ఎస్సెమ్మెస్ ద్వారా నిర్వహించిన పోల్ లో మెగాన్ ఫాక్స్, ఏంజెలినా జోలీ, బ్లేక్ లైవ్లీ వంటి హాలీవుడ్ తారలతోపాటు బాలీవుడ్ తారలను కూడా వెనక్కి నెట్టి 27 ఏళ్ల కత్రినా.. మరోసారి ఆ ఘనత సాధించింది. దీనిపై కత్రినా స్పందిస్తూ, ‘‘ఈ విషయం తెలియగానే చెప్పలేనంత ఆనందం కలిగింది. ప్రజలు కేవలం నా భౌతికరూపం చూసి మాత్రమే ఓటు వేయట్లేదు. నాకు సంబంధించిన అన్ని విషయాలనూ చూసిన తర్వాతే ఈ గౌరవం కట్టబెడుతున్నారు’’ అని పేర్కొంది. సెక్సీగా ఉండటం అనేది కేవలం వస్త్రధారణకు సంబంధించిన విషయం కాదంటోంది ఈ అందాల భామ.

Comments