మంత్రి పార్థసారథికి ఊరట
హైదరాబాద్, జులై 31: ఫెరా నిబంధనలు ఉల్లఘించిన కేసులో జైలుశిక్ష పడిన మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథికి ఊరట లభించింది. జైలుశిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తూ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో మంత్రి పార్థసారధికి రెండు నెలల జైలు శిక్షను ప్రత్యేక ఆర్థిక నేరాల కోర్టు విధించింది. కేపీఆర్ టెలీప్రొడక్ట్స్ ఎండీ హోదాలో ఫారిన్ ఎక్ఛేంజ్ రెగ్యులేషన్ యాక్టు (ఫెరా) నిబంధనలు ఉల్లంఘించిన కేసులో ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు విధించిన రెండు నెలల సాధారణ జైలు శిక్షను సవాల్ చేస్తూ మంత్రి పార్థసారథి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టును సోమవారం ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
Comments