ఇద్దరు డిప్యుటీలతో శెట్టర్ ప్రమాణం
బెంగళూరు,జులై 12; కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా జగదీష్ శెట్టర్ బాధ్యతలు చేపట్టారు. బెంగళూరు రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ భరద్వాజ్ గురువారం మధ్యాహ్నం శెట్టర్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రాజకీయ సర్దుబాట్లు, కులసమీకరణాల్లో భాగంగా ఇద్దరు సీనియర్లను ఆయన ఉప ముఖ్యమంత్రులుగా తీసుకున్నారు.బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు ఈశ్వరప్ప, సీనియర్ మంత్రి అశోక్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిద్దరూ కాకుండా మరో 29 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అధికార మార్పిడి జరిగినా యడ్యూరప్ప వర్గీయులు చాలా మంది ప్రమాణస్వీకారానికి హాజరు కాలేదు. \

Comments