రైళ్ళలో ‘ఇన్ఫోటైన్‌మెంట్’' సౌకర్యం
బెంగళూరు,జులై 11; రైళ్ళలో ‘ఇన్ఫోటైన్‌మెంట్’ (ప్రసార మాధ్యమ సౌకర్యం) గా సరికొత్త సీటింగ్, ప్రతి బోగీలో రెండు టీవీలు, డిజిటల్ ఆడియో, జీపీఎస్ విధానం కల్పించబోతున్నారు. ఈ సదుపాయాన్ని ప్రధమంగా నైరుతి రైల్వే అందుబాటులోకి తెచ్చింది. బెంగళూరు-చెన్నై-బెంగళూరు మధ్య నడిచే శతాబ్దిలో ప్రయోగాత్మకంగా వీటిని ఏర్పాటుచేశారు. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి మునియప్ప, బెంగళూరు నగర రైల్వే స్టేషన్‌లో మంగళవారం ఈ సదుపాయాన్ని ప్రారంభించారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో భాగంగానే దీనికి శ్రీకారం చుట్టారు. ప్రయాణికుల గమ్యస్థానాల వివరాలతో కూడిన డిజిటల్ ఆడియో, వినోదాన్ని పంచేందుకు టీవీలు ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. చెన్నై-బెంగళూరు మధ్య నడిచే లాల్‌బాగ్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హుబ్లి మధ్య నడిచే జన శతాబ్దిల్లోనూ ఈ సౌకర్యాలను అందించడానికి నిర్ణయించినట్టు అధికారులు వెల్లడించారు.
Comments