ముంబయి,జులై 12; : బాలీవుడ్ నటుడు, మల్లయోధుడు దారాసింగ్ (84) కన్నుమూశారు. ఈనెల 7న గుండెపోటుతో ఆయన ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరారు. మెదడు బాగా దెబ్బతిందని, కోలుకోవడం కష్టమని డాక్టర్లు తేల్చారు. కోమాలోకి వెళ్లే ప్రమాదముండడంతో కుటుంబసభ్యుల కోరిక మేరకు దారాను ఇంటికి పంపగా అక్కడే ఆయన తుదిశ్వాస విడిచారు. పంజాబ్‌లో సిక్కుల కుటుంబంలో నవంబర్ 19, 1928లో దారాసింగ్ పుట్టారు. దేశ, విదేశాల్లో మల్లయోధుడిగా గుర్తింపుపొందారు. కామన్ వెల్థ్ త్ దేశాల్లో పర్యటించిన దారా ఒరియంటల్ చాంపియన్ కింగ్‌ఖాన్, జార్జ్ గోర్డియెంకో, జాన్ డిసెల్వాతోపాటు పేరుగాంచిన ఎందరినో ఓడించారు. 1954లో ఇండియన్ ఛాంపియన్‌గా 1968లో వరల్డ్ ఛాంపియన్‌గా ఎదిగారు. 1960-70లలో ఎన్నో సినిమాల్లో ఆయన యాక్షన్ కింగ్‌గా నటించారు. బుల్లితెర రామాయణ్ లో హనుమాన్ గా రాణించారు. డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గా కూడా ఆయన మంచిపేరు తెచ్చుకున్నారు. ఇటు సీరియల్స్, యాడ్స్ లో కూడా నటించిన దారా 2007లో వచ్చిన జబ్ వి మెట్‌లో చివరిసారిగా తెరపై కనిపించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment