రాజ్యసభకు సచిన్ నామినేషన్‌పై కేసు
మదురై,మే 1: సచిన్ టెండూల్కర్‌ను రాజ్యసభకు నామినేట్ చేయడాన్ని సవాలు చేస్తూ మద్రాసు హైకోర్టు మదురై బెంచ్‌లో ఒక పిటిషన్ దాఖలైంది. మదురై సమీపంలోని ఒక కోర్టులో సచిన్‌పై ఒక కేసు పెండింగులో ఉన్నందున రాజ్యసభ సభ్యునిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయకుండా ఉండేలా ఆదేశాలు జారీ చేయాలని ఎ.బెనిటో అనే న్యాయవాది తన పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌కు, రాజ్యసభ సచివాలయానికి, ప్రధాన కార్యదర్శికి ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. జమైకాలో 2010 మార్చిలో జరిగిన ఒక పార్టీలో సచిన్ జాతీయ పతాకాన్ని అవమానించారనే ఆరోపణపై మేలూరు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో దాఖలైన ఫిర్యాదు పెండింగ్‌లో ఉంది.