భద్రాచలంలో కన్నుల పండువగా సీతారాముల కళ్యాణోత్సవం
భద్రాచలం,ఏప్రిల్ 1: శ్రీ రామ నవమి సందర్భంగా ఆదివారం భద్రాచలంలో సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి స్వామి వారికి, అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ప్రత్యేక హెలికాప్టర్ హైదరాబాద్ నుంచి ఇక్కడకు చేరుకున్న సీఎం ముందుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రులు సి. రామచంద్రయ్య, బాలరాజు, పొన్నాల లక్ష్మయ్య తదితర ప్రముఖులు శ్రీరామనవమి వేడుకలకు హాజరయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కనుమూరి బాపిరాజు టీటీడీ తరపున సీతారామ దంపతులకు పట్టువస్త్రాలు సమర్పించారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో సీతారాముల శిరస్సుపై పురోహితులు జీలకర్ర బెల్లం ఉంచారు.
Comments