జగన్ పార్టీలోకి వంగవీటి రాధా...
విజయవాడ ,ఏప్రిల్ 3: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి విజయవాడకు చెందిన వంగవీటి రాధా చేరేందుకు ముహూర్తం దాదాపు ఖరారైందని తెలుస్తోంది. ఆయన జగన్ పార్టీలో చేరేందుకు తన తండ్రి రంగా పుట్టిన తేది అయిన జూలై నాలుగో తేదిని ఎంచుకుంటు సమాచారం. తొలుత కాంగ్రెసు పార్టీలో ఉన్న వంగవీటి రాధా ఆ తర్వాత చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో చేరారు. చిరంజీవి తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని భావించి కొంతకాలం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఆ తర్వాత చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేశారు. విజయవాడలో ఉన్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో వంగవీటి రాధాకు చిరంజీవితో వెళ్లే పరిస్థితి లేదు. దీంతో కాంగ్రెసులోకి వెళ్లలేదు. తాజాగా జగన్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

Comments