కేంద్ర మాజీ మంత్రి ఎన్‌కేపీ సాల్వె మృతి
న్యూఢిల్లీ,ఏప్రిల్ 1: కేంద్ర మాజీ మంత్రి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్‌కేపీ సాల్వె(90) ఆదివారం ఉదయం కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారని సాల్వె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు కుమారు హరీష్ సాల్వె, కుమార్తె అరుంధతి ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని చిన్‌వాడ ప్రాంతంలో జన్మించిన సాల్వె క్రికెట్ అడ్మినిస్ట్రేషన్‌లో చాలా ఏళ్లు సేవలందించారు. కేంద్ర మంత్రిగా పలు శాఖలు నిర్వహించారు.
Comments