అమెరికాలో నగరాలలో ‘కళ్యాణమస్తు’
తిరుపతి,ఏప్రిల్ 4: అమెరికాలోని పది నగరాలలో ‘కళ్యాణమస్తు’ కార్యక్రమం ద్వారా సామూహిక వివాహాల్ని జరిపేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 28 నుంచి జూన్ 2 తేది వరకు కళ్యాణమస్తు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు టీటీడీ తెలిపింది.సాన్ జోస్, సాక్రమెంటోకా, న్యూజెర్సీ, నార్త్ కోస్ట్, డల్లాస్, అరిజోనా, డెట్రాయిట్, మిల్‌వాలీకీ పోర్ట్లాండ్, సీటెల్ నగరాల్లో ‘కళ్యాణమస్తు’ నిర్వహించనున్నట్టు టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు వెల్లడించారు. గత త్రైమాసికంలో భక్తులు సమర్పించిన బంగారు ఆభరణాల వల్ల 34 కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందని ఆయన తెలిపారు.
Comments