జగన్ కేసు: బెయిల్‌పై విజయసాయి రెడ్డి విడుదల
హైదరాబాద్,ఏప్రిల్ 13: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డికి ఊరట లభించింది. విజయసాయిరెడ్డి చంచల్‌గూడ జైలు నుంచి శుక్రవారం బెయిల్ పై విడుదలయ్యారు. జనవరి 2 తేది నుంచి విజయసాయిరెడ్డి చంచల్‌గూడ జైలులో ఉన్నారు. విజయసాయిరెడ్డికి షరతులతో కూడిన బెయిల్‌ను నాంపల్లి కోర్టు మంజూరు చేసింది. 25 వేల ఇద్దరి వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేస్తూ.. హైదరాబాద్ విడిచి వెళ్లకూడదనే షరతును కోర్టు విధించింది. పాస్‌పోర్టును కోర్టుకు అప్పగించాలని కోర్టు ఆదేశించింది.
Comments