మెక్సికోలో భూకంపం
మెక్సికో,ఏప్రిల్ 3: మెక్సికోలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది. భూ ప్రకంపనలతో ఉద్యోగులు కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రతకు చాలా భవనాలకు పగుళ్ళు ఏర్పడ్డాయి. గత నెలలో కూడా మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. వరుస ప్రకంపనలు సంభవిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. కాగా ఆస్తి, ప్రాణ నష్టంపై ఎలాంటి సమాచారం లేదు.
Comments