సెకండ్ ఇంటర్ లో 58.43 శాతం పాస్
హైదరాబాద్, ఏపిల్ 24: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం లో ఈ ఏడాది 58.43 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను మంగళవారం మాధ్యమిక శాఖ మంత్రి పార్థసారధి విడుదల చేశారు. ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 9,45,694 మంది విద్యార్థులు హాజరు కాగా, 4,94,758మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికల ఉత్తీర్ణత శాతం 61.25 కాగా బాలురు 55.95 శాతం ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 4.84 శాతం ఉత్తీర్ణత తగ్గింది. 74 శాతంతో కృష్ణాజిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, 43 శాతం ఉత్తీర్ణతతో నిజామాబాద్ చివరి స్థానంలో ఉంది. ద్వితీయ స్థానంలో విశాఖపట్నం నిలిచింది. వొకేషనల్ ఫలితాల్లో 72 శాతంతో నల్గొండ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 23 నుంచి జరుగుతాయి.
Comments