Tuesday, January 7, 2014

అసెంబ్లీకి పంపిన విభజన బిల్లు ఒట్టొట్టిదే...కేంద్ర హోం శాఖ

న్యూఢిల్లీ, జనవరి 7 : ఫిబ్రవరి మొదటి వారంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర హోంశాఖ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ నుంచి ఈనెల 23వ లేదీ లోపల టి. బిల్లు కేంద్రానికి వచ్చినా రాకపోయినా పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టడం జరుగుతుందని కేంద్ర హోంశాఖ   రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి  రాసిన లేఖ లో స్పష్టం చేసినట్టు సమాచారం. టి. బిల్లుపై శాసనసభలో సభ్యులు లేవనెత్తిన అభ్యంతరాలకు  పార్లమెంట్‌లోనే సమాధానం చెబుతామని,   ఫిబ్రవరి 3వ తేదీ నుంచి జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఖచ్చితంగా బిల్లు ప్రవేశపెడతామని కేంద్రహోంశాఖ తెలిపింది. ఒక వేళ రాష్ట్రపతి ఒక నెలరోజులు గడువు ఇస్తే మాత్రం చెప్పలేమని హోంశాఖ తెలిపింది.  ఫిబ్రవరి మూడవ తేదీ నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. బిల్లుపై పార్లమెంటులో సమగ్ర చర్చ జరుగుతుందని, రాష్ట్ర శాసనసభకు  పంపింది ముసాయిదా బిల్లు మాత్రమేనని  హొం శాఖ తెలిపింది. పార్లమెంటులో ప్రవేశపెట్టేదే తుది బిల్లు అని కూడా ఆ లేఖలో పేర్కొనడం గమనార్హం. తుది బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు అన్ని అంశాలపై సమగ్ర చర్చ జరుగుతుందని వివరించింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...