Wednesday, January 1, 2014

అగస్టా వెస్ట్ లాండ్ తో ఒప్పందం రద్దు...

న్యూఢిల్లీ, జనవరి 1:  భారత య వైమానిక దళానికి 12 వీవీఐపీ హెలికాప్టర్లను సరఫరా చేయడానికి ఆంగ్లో-ఇటాలియన్ కంపెనీ అగస్టా వెస్ట్ లాండ్ తో గతంలో కుదిరిన భారీ ఒప్పందాన్ని భారత్ రద్దుచేసుకుంది. రూ. 3,600 కోట్ల విలువైన ఈ ఒప్పందం కుదరడానికి ఆ కంపెనీ కొంతమంది వ్యక్తులకు రూ. 360 కోట్లు లంచం ముట్టజెప్పిందని ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2010లో కుదిరిన ఈ ఒప్పందం కోసం భారత వైమానిక దళం మాజీ అధిపతి ఎస్.పి. త్యాగి తదితరులకు భారీ మొత్తంలో లంచాలు ముట్టజెప్పారని ఆరోపణలు వచ్చాయి.ఈ కేసును ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది.  ఈ తరుణంలో  బుధవారం ఉదయం ప్రధాని మన్మోహన్ సింగ్, రక్షణ మంత్రి ఏకే ఆంటోనీల మధ్య జరిగిన  సమావేశం అనంతరం ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. కాగా, మొత్తం 12 హెలికాప్టర్లకు గాను ఇప్పటికే మూడింటిని అగస్టా వెస్ట్ లాండ్ సంస్థ భారత్ కు పంపేసింది. ఇప్పుడు ఈ కంపెనీతో ఆర్బిట్రేషన్ కు వెళ్లాలని భారత్ నిర్ణయించుకున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...