Wednesday, January 1, 2014

శాఖల మార్పుపై సంజాయిషీ చెప్పాలా,,,! సి.ఎం.

హైదరాబాద్, జనవరి 1: మంత్రుల శాఖల  మార్పుపై తానెవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి  స్పష్టం చేశారు. సీఎంగా తనకు శాఖలను మార్పు చేసే అధికారం ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో 9.5 శాతం ప్రభుత్వ రెవెన్యూ తగ్గిందని అందుకే శ్రీధర్‌బాబుకు వాణిజ్య పన్ను శాఖను అప్పగించినట్లు ముఖ్యమంత్రి  తెలిపారు. జనవరి 23 వరకు అసెంబ్లీలో చర్చ జరగడంపైనే తన దృష్టి అని, సమైక్యం కోరుకునే ఎమ్మెల్యేలు చర్చలో పాల్గొనాలని, బంతి వేశాకే ఎలా ఆడాలో నిర్ణయిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.  భవిష్యత్‌పై తనకెప్పుడూ అంచనాలు లేవని చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని తెలంగాణ నుంచే తనకు ఎక్కువగా లేఖలు వచ్చాయని సీఎం తెలిపారు జగన్ మీడియాతో మాట్లాడినంత మాత్రాన సమైక్యవాదం వినిపించినట్లు కాదని సీఎం అన్నారు. అసెంబ్లీలో చర్చ సజావుగా జరిగితేనే ఏ ప్రాంతాలకు లాభం, నష్టం జరిగిందో వివరించవచ్చునని ఆయన అన్నారు.
కొత్తశాఖ పై ఇప్పుడే స్పందించను-శైలజానాథ్
కొత్తగా అప్పగించిన మంత్రిత్వ శాఖ గురించి ఇప్పడే స్పందించనని, రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోదని సమైక్యంగానే ఉంటుందని మంత్రి శైలజానాథ్ స్పష్టం చేశారు.
వాణిజ్య పన్నులు నాకొద్దు-శ్రీధర్ బాబు
వాణిజ్య పన్నుల శాఖ మంత్రి పదవికి అర్హులైన వారు ఎంతో మంది మంత్రివర్గంలో ఉన్నారని ,అలాంటి వారికి  ఆ శాఖ అప్పగిస్తే బాగుండేదని మంత్రి డి.శ్రీధర్ బాబు అన్నారు. వాణిజ్య పన్నుల శాఖ బాధ్యతలు చేపట్టే ప్రసక్తి లేదని పష్టం చేశారు.  సహచర మంత్రులతో చర్చించి తర్వాత  తన భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని శ్రీధర్ బాబు ఈ సందర్భంగా వెల్లడించారు.




No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...