Monday, January 13, 2014

నటి అంజలీదేవి కన్నుమూత....

చెన్నై,జనవరి 13:  సిని9ఇ  నటి అంజలీదేవి (86) కన్నుమూశారు. అనారోగ్యంతో గత వారం రోజులుగా చెన్నైలోని విజయ హాస్పటల్ లో చికిత్స  పొందుతున్న    ఆమె సోమవారం   తుది శ్వాస విడిచారు.  అవయవ దానం కోసం అంజలీ దేవి భౌతికకాయాన్ని చెన్నై రామచంద్రా మెడికల్ కళాశాలకు పంపారు. 1928 ఆగస్ట్ 24న తూర్పుగోదావరి జిల్లా పెద్దపురంలో అంజలీదేవి జన్మించారు. ఆమె అసలు పేరు అంజనీ కుమారి. అనార్కలీగా, సీతగా..  పలుపాత్రలకు ఆమె జీవం పోశారు. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావుల సరసన అత్యధిక సినిమాల్లో ఆమె  హీరోయిన్‌గానే కాకుండా వారికి తల్లిగా కూడా కొన్ని సినిమాల్లో నటించడం  విశేషం. 'గొల్లభామ' సినిమాతో అంజలీదేవి చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఆదినారాయణరావును  వివాహం చేసుకున్నారు. ‘లవకుశ’ సినిమాలోని సీత పాత్ర ప్రేక్షకులకు దగ్గరయ్యారు.  సువర్ణ సుందరి, అనార్కలి, కీలుగుర్రం, భక్తతుకారాం, బడిపంతులు, శ్రీ షిర్డిసాయిబాబా మహత్యం, చెంచులక్షి తదితర 500 పైగా చిత్రాల్లో ఆమె నటించారు.  హిందీ చిత్ర సీమలో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె హిందీలో 28 చిత్రాల్లో నటించారు.  27 చిత్రాలకు నిర్మాణ సారథ్య బాధ్యతలు చేపట్టారు. 1955లో అనార్కలి చిత్రానికి ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకోగా, 1957లో సువర్ణ సుందరి చిత్రానికి ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు, 1958లో చెంచులక్ష్మి చిత్రానికి ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును, 1959లో జయభేరి చిత్రానికి ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నారు.సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను అంజలీదేవికి 2005లో రఘుపతి వెంకయ్య అవార్డు, 2006లో రామినేని అవార్డు, 2008లో ప్రతిష్టాత్మకమైన అక్కినేని నాగేశ్వరరావు అవార్డులు లభించాయి. 1994లో  ’పోలీస్‌ అల్లుడు’  చివరి సినిమా.

 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...