Sunday, January 5, 2014

జిఎస్ ఎల్ వి-డి5 ప్రయోగం సక్సెస్...

 నెల్లూరు,జనవరి 5:  శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్  నుంచి  జిఎస్ ఎల్ వి-డి5 రాకెట్ ను ఆదివారం సాయంత్రం 4:18 గంటలకు  విజయవంతం గా ప్రయోగించారు. ఈ రాకెట్ ద్వారా  జిశాట్ -14 సమాచార  ఉపగ్రహాన్ని ప్రయోగించారు.  భారత అంతరిక్ష ప్రస్థానంలో ఇది  మరో కీలక ప్రయోగం . ఈ ప్రయోగాన్ని గతేడాది ఆగస్టు 19నే చేపట్టాల్సి ఉండగా, రాకెట్ రెండో దశలో ఇంధన లీకేజీ కారణంగా ఆఖరి గంటలో వాయిదా పడింది. ఇస్రో ఇంతవరకూ ఏడు జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు చేపట్టింది. రెండే  విజయవంతం అయ్యాయి. జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌లో కీలక దశ అయిన అప్పర్ క్రయోజెనిక్ దశను ఇస్రో స్వదేశీయంగానే తయారుచేసింది. జీఎస్‌ఎల్‌వీ  డీ-5 పొడవు: 49.13 మీటర్లు,,, బరువు: 414.75 టన్నులు ...ప్రయోగం ఖర్చు: రూ.205 కోట్లు  (రాకెట్‌కు రూ.160 కోట్లు, ఉపగ్రహానికి రూ.45 కోట్లు) ... జీశాట్-14 బరువు:1,982 కిలోలు... పనిచేసే కాలం: 12 ఏళ్లు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...