Friday, January 3, 2014

రాహుల్ కు పొగడ్త...మోడీకి తెగడ్త...ప్రధాని 'ప్రె(తు)స్ ' కాన్ ఫరెన్స్ !

న్యూఢిల్లీ, జనవరి 3:  గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ  ప్రధానమంత్రి కావడం దేశానికి వినాశకరం అన్నది తన అభిప్రాయమని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అన్నారు. గుజరాత్‌లో జరిగిన మారణకాండ మరోసారి ఈ దేశంలో జరగాలని కోరుకోవడం లేదని ఆయన  ఢిల్లీలో  విలేకరుల సమావేశంలో అన్నారు.  గత పదేళ్లలో ప్రధాన మంత్రి  ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడడం ఇది మూడవ సారి. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి తమను తాము నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని మన్ మోహన్ పేర్కొన్నారు.  అవినీతి ప్రధానమైన అంశమని, దీనిని కేజ్రీవాల్  సమర్థవంతంగా ప్రజల ముందు కు తీసుకు వెళ్ళారని అన్నారు. తాము అధికారంలో ఉన్నంత వరకు సంస్కరణలు కొనసాగిస్తామని చెప్పారు.  తనకు కాంగ్రెసు పార్టీ నుండి, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నుండి ఎప్పుడూ అనూహ్య మద్దతు లభించిందన్నారు. పదేళ్లలో ఎప్పుడూ కాంగ్రెసు పార్టీ, ప్రభుత్వం మధ్య విభేదాలు రాలేదన్నారు. రెండు అధికార కేంద్రాలున్నాయన్నది అవాస్తవమని కొట్టి పారేశారు. సంకీర్ణ ప్రభుత్వంలో ఇబ్బందులు సహజమన్నారు.  2014 ఎన్నికల తర్వాత ఏర్పడబోయే కొత్త ప్రభుత్వానికి యూపిఏ నాయకత్వం వహిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాము అమెరికాతో వ్యూహాత్మక సంబంధాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. అవినీతిపై తనను ఎప్పుడు ఎవరు ప్రశ్నించలేదన్నారు. పార్టీ యువ నాయకత్వం కొత్తతరం ఆశలకు, ఆకాంక్షలకు అనుగుణం గా పనిచేస్తోందని తెలిపారు. రాహుల్ సమర్థుడైన నాయకుడని ప్రశంసించారు.





No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...