Saturday, January 2, 2021

రామతీర్ధం...రణక్షేత్రం

విజయనగరం,జనవర్ 2; ఆంధ్రప్రదేశ్​లోని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని రామతీర్థం రాజకీయ రణక్షేత్రం  గా మారింది.  గ్రామంలోని బోడికొండపై ఉన్న ఆలయంలో కోదండరాముని విగ్రహం శిరస్సు ధ్వంసం కావడం... అది సమీపంలోని కొలనులో దొరకడం... రాజకీయ దుమారం లేపింది. తెలుగుదేశం, బి జె పి సహా ప్రతిపక్షాలన్నీ జగన్ పాలనపై విమర్శల వర్షం కురిపించగా... అధికార పార్టీ నేతలు అందుకు దీటుగా బదులిచ్చారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, వై సి పి ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి రామతీర్థం సందర్శనకు తరలివచ్చారు. రామతీర్థానికి వస్తున్న చంద్రబాబు కాన్వాయ్‌ను అడుగడుగునా అడ్డుకున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా.... చంద్రబాబు కొద్దిసేపు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆ తర్వాత తిరిగి బయల్దేరిన చంద్రబాబు కాన్వాయ్ ను నెల్లిమర్ల-రామతీర్థం కూడలి వద్ద పోలీసులు నిలిపివేశారు. చంద్రబాబు అక్కడ్నుంచి నడుచుకుంటూ రామతీర్థం బయల్దేరారు. కాగా, బోడికొండ వద్ద వై సి పి ఎంపీ విజయసాయిరెడ్డి రాకతో... అక్కడ పరిస్థితులు మరింత వేడెక్కాయి. ఆయన... కొండపైకి వెళ్తుండగా... తెలుగుదేశం,వై సి పి, బిజెపి కార్యకర్తలు ఎదురుపడి.... పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో మూడు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఘటనాస్థలాన్ని పరిశీలించి విజయసాయిరెడ్డి కిందకు దిగుతుండగాఆయన వాహనంపై గుర్తు తెలియని వ్యక్తి... రాయి విసిరారు. 

 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...