Tuesday, April 8, 2014

కన్నుల పండువగా కళ్యాణోత్సవం...

ఖమ్మం, ఏప్రిల్ 8 :భద్రాచలం లో  శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం మంగళవారం ఉదయం కన్నుల పండువగా జరిగింది. నవవధూవరులుగా భక్తులకు దర్శనమిస్తూ కల్యాణమండపానికి చేరుకున్న సీతారాములకు గవర్నర్ నరసింహన్ దంపతులు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు స్వామి వారి కల్యాణం జరిగింది. అంతకుముందు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ధ్రువమూర్తుల కల్యాణం, ఉదయం 9:30 నుంచి 10:30 వరకు కల్యాణమూర్తుల ఊరేగింపు నిర్వహించారు. దేవాలయం నుంచి కల్యాణ మండపం వరకు అంగరంగ వైభవంగా స్వామివారి ఊరేగింపు జరిగింది. భద్రాది సీతారాముల కల్యాణమోహత్సవం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తరపున చైర్మన్ కనుమూరి బాపిరాజు సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...