Monday, April 7, 2014

టి.కాంగ్రెస్ అభ్యర్ధులు రెడీ-8మంది సిట్టింగ్ లు అవుట్-సి.పి.ఐ. కి 8 సీట్లు

న్యూఢిల్లీ,ఏప్రిల్ 7: తెలంగాణ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదలైంది.  'ఒక కుటుంబం నుంచి ఒక్కరికే చాన్స్' అనే నిబంధనను కాంగ్రెస్ నిక్కచ్చిగా పాటించింది. మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డికి చేవెళ్ల లోక్‌సభ స్థానం కేటాయించిన నేపథ్యంలో సబితకు అసెంబ్లీ సీటు ఇవ్వలేదు. మొత్తంగా 111 సీట్లలో 8 మంది మహిళలకు మాత్రమే అవకాశం కల్పించారు. మల్కాజ్‌గిరి స్థానాన్ని కేటాయించలేదని అలిగి, ఆగమేఘాలమీద  కాంగ్రెస్‌లో చేరిన తెలుగుదేశం ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, టీఆర్ఎస్ నుంచి మల్కాజ్‌గిరి సీటును ఆశించి భంగపడి, తిరిగి వెనక్కి తిరిగి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్‌లకు కూడా అధిష్ఠానం మొండిచెయ్యి చూపింది.  ఈ మధ్యనే ఎమ్మెల్సీగా ఎంపికైన నంది ఎల్లయ్యకు నాగర్ కర్నూల్ లోక్‌సభ సీటును కేటాయించగా, రెండేళ్లకు పైగా పదవీ కాలం ఉన్న ఎమ్మెల్సీ షబ్బీర్ అలీకి అసెంబ్లీ సీటు ఇచ్చింది. రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్‌లకు కూడా అసెంబ్లీ స్థానాలు ఇచ్చినప్పటికీ వారి పదవీ కాలం రెండేళ్లలోపే ఉంది.
టి. కాంగ్రెస్ అభ్యర్ధులు వీరే
సిర్పూర్‌- ప్రేమ్‌సాగర్‌రావు, చెన్నూరు- జి.వినోద్‌
మంచిర్యాల- అరవింద్‌రెడ్డి, అసిఫాబాద్‌- సక్కు
ఖానాపూర్‌- హరినాయక్‌, ఆదిలాబాద్‌- భార్గవ్‌దేశ్‌పాండే
బోథ్‌- జే.అనిల్‌, నిర్మల్‌- ఎ.మహేశ్వర్‌రెడ్డి, ముథోల్‌- విఠల్‌రెడ్డి,

ఆర్మూర్‌- సురేష్‌రెడ్డి, బోధన్‌- పి.సుదర్శన్‌రెడ్డి
జుక్కల్‌- గంగారాం, బాన్సువాడ- కాసుల బాలరాజు
ఎల్లారెడ్డి- వేదుల సురేంద్ర, కామారెడ్డి- షబ్బీర్‌అలీ
నిజామాబాద్‌ అర్బన్‌- మహేష్‌గౌడ్‌
నిజామాబాద్‌ రూరల్‌- డి.శ్రీనివాస్‌, బాల్కొండ- అనిల్‌

కోరుట్ల- కొమిరెడ్డి రాములు, జగిత్యాల- జీవన్‌రెడ్డి
ధర్మపురి- ఎ.లక్ష్మణ్‌కుమార్‌, రామగుండం- సలీం పాషా
మంథని- శ్రీధర్‌బాబు, పెద్దపల్లి- భానుప్రసాదరావు
కరీంనగర్‌- లక్ష్మీనర్సింహరావు, చొప్పదండి- సుద్దాల దేవయ్య
వేములవాడ- బొమ్మ వెంకటేశ్వర్లు, సిరిసిల్ల- రవీందర్‌రావు
మానకొండూరు- ఆరేపల్లి మోహన్‌
హుజురాబాద్‌- సుదర్శన్‌రెడ్డి, హుస్నాబాద్‌- ప్రవీణ్‌రెడ్డి

సిద్దిపేట- శ్రీనివాస్‌గౌడ్‌, మెదక్‌- విజయశాంతి
నారాయణ్‌ఖేడ్‌- కిష్టారెడ్డి, ఆందోల్‌- దామోదర రాజనర్సింహ
నర్సాపూర్‌- సునీతలక్ష్మారెడ్డి, జహీరాబాద్‌- గీతారెడ్డి
సంగారెడ్డి- జగ్గారెడ్డి, పటాన్‌చెరు- నందీశ్వర్‌గౌడ్‌
దుబ్బాక- ముత్యంరెడ్డి, గజ్వేల్‌- నర్సారెడ్డి

మేడ్చల్‌- కేఎల్‌ఆర్‌, మల్కాజ్‌గిరి- నందికంటి శ్రీధర్‌
కుత్బుల్లాపూర్‌- కూన శ్రీశైలంగౌడ్‌, కూకట్‌పల్లి- నర్సింహయాదవ్‌
ఉప్పల్‌- లక్ష్మారెడ్డి, ఇబ్రహీంపట్నం- కైమ మల్లేష్‌
ఎల్బీ నగర్‌- సుధీర్‌రెడ్డి, రాజేంద్రనగర్‌- జ్ఞానేశ్వర్‌
శేరిలింగంపల్లి- భిక్షపతియాదవ్‌, చేవెళ్ల- కె.యాదయ్య
పరిగి- రాంమోహన్‌రెడ్డి, వికారాబాద్‌- గడ్డం ప్రసాద్‌
తాండూరు- నారాయణరావు

ముషిరాబాద్‌- డా.వినయ్‌కుమార్‌, మలక్‌పేట్‌- విఎన్‌.రెడ్డి
అంబర్‌పేట్‌- వీహెచ్‌, ఖైరతాబాద్‌- దానం నాగేందర్‌
జూబ్లీహిల్స్‌- విష్ణువర్దన్‌రెడ్డి, సనత్‌నగర్‌- మర్రి శశిధర్‌రెడ్డి
నాంపల్లి- వినోద్‌కుమార్‌, కార్వాన్‌- రూప్‌సింగ్‌
గోషామహల్‌- ముఖేష్‌గౌడ్‌, చార్మినార్‌- కె.వెంకటేష్‌
చాంద్రయణగుట్ట- మైనంపాటి అశ్విన్‌రెడ్డి, యాకుత్‌పురా- సదానంద్‌
బహుదూర్‌పురా- అబ్దుల్‌ సమీ, సికింద్రాబాద్‌- జయసుధ
కంటోన్మెంట్‌- క్రిషాంక్‌

కొడంగల్‌- విఠల్‌రావు, నారాయణ్‌పేట్‌- వామనగిరి కృష్ణ
మహబూబ్‌నగర్‌- ఒబేదుల్లా కొత్వాల్‌, దేవరకద్ర- పవన్‌కుమార్‌
మక్తల్‌- చిట్టెం రాంమోహన్‌రెడ్డి, వనపర్తి- చిన్నారెడ్డి
గద్వాల- డీకే అరుణ, అలంపూర్‌- సంపత్‌కుమార్‌
నాగర్‌కర్నూల్‌- దామోదర్‌రెడ్డి, అచ్చంపేట- వంశీకృష్ణ
కల్వకుర్తి- వంశీచంద్‌రెడ్డి, షాద్‌నగర్‌- ప్రతాప్‌రెడ్డి
కొల్లాపూర్‌- హర్షవర్దన్‌రెడ్డి

నాగార్జునసాగర్‌- జానారెడ్డి, మిర్యాలగూడ- భాస్కర్‌రావు
హుజూర్‌నగర్‌- ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సూర్యాపేట- దామోదర్‌రెడ్డి
నల్గొండ- కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భువనగిరి- పోతంశెట్టి వెంకటేశ్వర్లు
నకిరేకల్‌- చిరుమర్తి లింగయ్య, తుంగతుర్తి- గుడిపాటి నర్సయ్య
ఆలేరు- భిక్షమయ్యగౌడ్‌

జనగాం- పొన్నాల లక్ష్మయ్య, స్టేషన్‌ఘన్‌పూర్‌- విజయరామారావు
పాలకుర్తి- దుగ్యాల శ్రీనివాసరావు, డోర్నకల్‌- రెడ్యానాయక్‌
మహబూబాబాద్‌- కవిత, నర్సంపేట- దొంతి మాధవరెడ్డి
పరకాల- ఈ.వెంకట్రామ్‌రెడ్డి, వరంగల్‌ వెస్ట్‌- ఎర్రబెల్లి స్వర్ణ
వరంగల్‌ ఈస్ట్‌- బస్వరాజు సారయ్య, వర్దన్నపేట్‌- కొండేటి శ్రీధర్‌
భూపాలపల్లి- గండ్ర వెంకటరమణారెడ్డి, ములుగు- వీరయ్య

ఇల్లెందు- కొర్రం కనకయ్య, ఖమ్మం- పువ్వాడ అజయ్‌
పాలేరు- ఆర్‌.వెంకట్‌రెడ్డి, మధిర- భట్టి విక్రమార్క
సత్తుపల్లి- సంబాని చంద్రశేఖర్‌, అశ్వరావుపేట- మిత్రసేన
భద్రాచలం- కుంజా సత్యవతి

సీపీఐకి కేటాయించిన స్థానాలు ఇవే...
బెల్లంపల్లి, మహేశ్వరం, దేవరకొండ, కోదాడ, మునుగోడు..
పినపాక, వైరా, కొత్తగూడెం సీట్లను సీపీఐకి కేటాయించిన కాంగ్రెస్‌

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...