Friday, April 4, 2014

పీఎస్ఎల్‌వీ-సీ ప్రయోగం విజయవంతం... జూన్ తర్వాత మరో రెండు నేవిగేషన్ ఉపగ్రహాలు

శ్రీహరికోట , ఏప్రిల్ 4 : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన పీఎస్ఎల్‌వీ-సీ 24 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శుక్రవారం సాయంత్రం 5.14 గంటలకు షార్ నుంచి పీఎస్ఎల్‌వీ-సీ24  రాకెట్ నిప్పులు చిముమతూ నింగిలోకి దూసుకువెళ్ళింది. స్వదేశీ నేవిగేషన్‌కు సంబంధించిన రెండో ఉపగ్రహం ఐఆర్ఎన్ఎస్ఎస్-1బీని ఈ రాకెట్ ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. బెంగుళూరులోని శాటిలైట్ సెంటర్‌లో రూపొందించిన ఈ ఉపగ్రహం ద్వారా స్వదేశీ గి.ఎస్.టి. అభివృద్ధికి వీలవుతుంది.  ఐఆర్ఎన్ఎస్ఎస్ ఏడు ఉపగ్రహాల వ్యవస్థ అని,  ఈ ఏడాదిలో జూన్ తర్వాత మరో రెండు నేవిగేషన్ ఉపగ్రహాలను ప్రయోగిస్తామని ఇస్రో చైర్మన్  రాధాకృష్ణన్ చెప్పారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...