Friday, April 4, 2014

టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో-ముస్లీం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు:24 కొత్త జిల్లాలు

హైదరాబాద్, ఏప్రిల్ 4 :  టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల   మేనిఫెస్టోను పార్టీ అధినేత కేసీఆర్  విడుదల చేశారు. ముస్లీం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంతో పాటు దాన్ని రాజ్యాంగబద్దం చేస్తామని హామీ ఇచ్చారు. ముస్లీం మైనార్టీల అభివృద్ధికి వెయ్యి కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ఉద్యోగుల పాత్ర కీలకమైనదని వారికి  తెలంగాణ ఇంక్రిమెంట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు వేతనాలు ఇవ్వనున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. పెన్సన్‌దారులకు కేంద్రంతో సమానంగా పెన్సన్లు ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. 24 కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని, యువతకు లక్ష ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో అమరవీరుల స్థూపాలను నిర్మిస్తామని, అలాగే వారి కుటుంబాల నుంచి ఒకరు లేక ఇద్దరికి ఉద్యోగం కల్పించనున్నట్లు కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పండుగగా బతుకమ్మను నిర్వహించనున్నట్లు కేసీఆర్ తెలిపారు. గిరిజన తండాలను గ్రామపంచాయితీలుగా మారుస్తామన్నారు. దళిత అభివృద్ధికి ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. వాల్మికి బోయలను ఎస్టీలో చేరుస్తామన్నారు. వికలాంగులకు రూ.1500, వితంతు, వృద్ధులకు వెయ్యి రూపాయల పెన్సన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. బలహీనవర్గాలకు పక్కా గృహాలు నిర్మిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కమతాల ఏకీకరణ లు ప్రాధాన్యత ఇస్తామన్నారు. భూములను కంప్యూటరైజ్డ్ చేస్తామన్నారు. లక్ష వరకు రైతులు రుణాలు మాఫీ చేస్తామని పేర్కొన్నారు. ఆటో కార్మికులపై వేధింపులు ఉండవన్నారు. ప్రతి నియోజగర్వంలో లక్ష ఎకరాలకు సాగునీరు, ఉచిత నిర్బంధ విద్యను అములు చేస్తామని తెలిపారు. ప్రతి మండల కేంద్రంలో 30 పడకల ఆస్పత్రి, నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఆస్పత్రి, ప్రతి జిల్లా కేంద్రంలో నిమ్స్ తరహా ఆస్పత్రులు నిర్మిస్తామని కేసీఆర్ హమీ ఇచ్చారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...