Sunday, April 6, 2014

లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు రంగం సిద్ధం...

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6 : సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు రంగం సిద్ధమైంది.  ఏప్రిల్ 7 సోమవారం నాడు  అసోం  (5), త్రిపుర (1) ల్లోని మొత్తం 6 లోక్‌సభ స్థానాలకు తొలి దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ స్థానాల్లో శనివారంతో ప్రచార గడువు ముగిసింది. అసోంలోని తేజ్‌పూర్, కొలియాబోర్, జొర్హాట్, డిబ్రుగర్, లక్ష్మీపూర్ లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. మూడు దశాబ్దాల తర్వాత ఉల్ఫా నుంచి ఎలాంటి ఎన్నికల బహిష్కరణ పిలుపు లేకుండా రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఐదు స్థానాలకు 51 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కేంద్ర మంత్రులు రానీ నర్హా, పవన్ సింగ్ ఘటోవర్, అసోం సీఎం తరుణ్ గొగోయ్ తనయుడు గౌరవ్ గొగోయ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. త్రిపురలోని పశ్చిమ త్రిపుర లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్, తృణమూల్, సీపీఎం నడుమ త్రిముఖ పోరు నడుస్తోంది. ఈ స్థానం సీపీఎంకి కంచుకోట. ఇక్కడ 15 సార్లు ఎన్నికలు జరిగితే 10 సార్లు సీపీఎం విజయం సాధించింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...