Sunday, December 22, 2013

భారత్, దక్షిణాఫ్రికా తొలి టెస్టు డ్రా....

జొహన్నెస్‌బర్గ్, డిసెంబర్ 22:  ఉత్కంఠభరితంగా సాగిన భారత్, దక్షిణాఫ్రికా తొలి టెస్టు డ్రాగా ముగిసింది. భారీ విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని దగ్గరగా వచ్చినప్పటికీ విజయాన్ని అందుకోలేపోయింది. చివర్లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సఫారీ టీమ్ అతిపెద్ద లక్ష్యాన్ని ఛేదించే అవకాశాన్ని కోల్పోయింది. టీమిండియా నిర్దేశించిన 458 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఛేధించే క్రమంలో దక్షిణాఫ్రికా ఏడు వికెట్లు కోల్పోయి 450 పరుగులు చేసింది. డీవిలియర్స్(103), డూఫ్లెసిస్(134) సెంచరీలతో చెలరేగడంతో సఫారీ జట్టు అతిపెద్ద లక్ష్యాన్ని ఛేదనకు చేరువగా వచ్చింది. 197 పరుగులకే నాలుగు వికెట్లు పడిన జట్టును వీరిద్దరూ సెంచరీలతో ఆదుకుని  గెలుపుబాటలోకి తీసుకొచ్చారు.  చివరి ఓవర్లలో ధోని సేన సమిష్టిగా రాణించి ఆతిథ్య జట్టును కట్టడి చేసి మ్యాచ్ డ్రాగా ముగించింది. భారత బౌలర్లలో షమీ 3 వికెట్లు పడగొట్టాడు. జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ చెరో వికెట్ తీశారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...