Sunday, December 8, 2013

పాఠాలు నేర్చుకుంటాం...

న్యూఢిల్లీ, డిసెంబర్ 8 :   నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఎన్నో కారణాలున్నాయని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. ఎన్నికల ఫలితాలు తమకు తీవ్ర నిరాశను కలగించాయని, ఓటమిని అంగీకరిస్తున్నామని చెప్పారు. ఈ ఫలితాలు తమకు హెచ్చరికలాంటివని అన్నారు.  కుమారుడు రాహుల్ గాంధీతో కలసి విలేకరులతో మాట్లాడుతూ,  కాంగ్రెస్ ఓటమికి గల కారణాలను విశ్వేషించాల్సివుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఓటమికి స్థానిక పరిస్థితులతో పాటు ధరల పెరుగుదల ఒక కారణమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సరైన సమయంలో ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తుందని సోనియా చెప్పారు. ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సివుందని రాహుల్ అన్నారు. ప్రజల అభిప్రాయాలకనుగుణంగా పనిచేసే సత్తా కాంగ్రెస్ కుందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నాయకులు తగువిధంగా పనిచేయలేదని రాహుల్ వ్యాఖ్యానించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...