Friday, January 15, 2016

బ్రిస్బేన్ లోను అదే వరస..చెత్త ఫీల్డింగ్ తో గెలుపును చేజార్చుకున్న భారత్

బ్రిస్బేన్ ,జనవరి 15; ఆస్ట్రేలియా పర్యటనలో భారత్‌కు రెండో వన్డేలో కూడా ఓటమి తప్పలేదు. బ్రిస్బేన్‌ వేదికగా శుక్రవారం జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో భారత్‌ ఏడు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ జట్టులో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (124: 127 బంతుల్లో 11×4, 3×6) అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ శతకం బాదడంతో టీమిండియా 8 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనను ధాటిగా ఆరంభించిన ఆస్ట్రేలియా ఓపెనర్లు అరోన్‌ ఫించ్‌ (71: 81 బంతుల్లో 7×4, 1×6), మిచెల్‌ మార్ష్‌ (71: 81 బంతుల్లో 5×4) భారత్‌ ఫీల్డర్ల తప్పిదాలను సొమ్ము చేసుకుని తొలి వికెట్‌కు 24.5 ఓవర్లలో ఏకంగా 145 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయానికి బాటలు వేశారు. వీరి ఔట్‌ అనంతరం స్టీవ్‌ స్మిత్‌ (49), జార్జ్‌ బెయిలీ (76 నాటౌట్‌), మాక్స్‌వెల్‌(26 నాటౌట్‌) కూడా బ్యాట్‌ ఝళిపించడంతో ఆసీస్‌ మరో 6 బంతులు మిగిలి ఉండగానే 3 మూడు వికెట్లు కోల్పోయి 309 పరుగులతో లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ఐదు వన్డేల సిరీస్‌లో ఆసీస్‌ 2-0తో ఆధిక్యం సాధించింది. మూడో వన్డే మెల్‌బోర్న్‌ వేదికగా జనవరి 17న జరుగు తుంది 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...