Thursday, January 28, 2016

హైదరాబాద్ తోనే వుంటా. ... చంద్రబాబు

హైదరాబాద్ ,జనవరి 28; టీడీపీతో తెలంగాణను ఎవరూ విడదీయలేరని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. గురువారం పటాన్‌చెరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... హైదరాబాద్‌లో ఐటీకి ప్రాధాన్యత ఇచ్చానని, దీనివల్ల 14 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. హైదరాబాద్‌ వల్ల తెలంగాణకు ఎక్కువ లాభం వచ్చిందని, ఔటర్‌ రింగురోడ్డు, మెట్రోరైలు ఘనత టీడీపీదేనని, 12 ఏళ్లయినా మెట్రో పనులు పూర్తి కాలేదని, అదే తాము మేము గెలిచి ఉంటే మూడేళ్లలో పూర్తిచేసే వాళ్లమన్నారు. అలాగే తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం ఎన్టీఆర్‌ తెచ్చారని, ఇప్పుడున్న నాయకులు ఎక్కడి నుంచి వచ్చారని, నన్ను విమర్శించే హక్కు వీరికి ఎక్కడిదని చంద్రబాబు ప్రశ్నించారు. అలాగే హైదరాబాద్‌లో అడుగడుగునా తాను చేసిన అభివృద్ధి ఉందని, నేను ఎక్కడికీ వెళ్లలేదు.. ఇక్కడే ఉంటా.. మీతోనే ఉంటా అని అన్నారు. తెలంగాణ సమస్యలపై కేంద్రంతో మాట్లాడుతూనే ఉన్నానని, తెలంగాణ రైతుల కోసం బాబ్లీపై పోరాడానని, నేను రాజీ పడ్డానని కాంగ్రెస్‌ వాళ్లు అంటున్నారని, ఇందిరా, రాజీవ్‌గాంధీ, సోనియాకే భయపడలేదని, నేను ఎవరికీ భయపడనని చంద్రబాబు ఉద్ఘాటించారు. అలాగే రాజకీయం వేరు.. ప్రభుత్వాలు వేరని, టీడీపీ ప్రజల పక్షానే ఉంటుందే తప్ప వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని, 26 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించడం సరికాదన్నారు. కేంద్రం సహకారం కావాలంటే టీడీపీ-బీజేపీని గెలిపించాలని చంద్రబాబు కోరారు.. తొలుత పటాన్‌చెరులో ప్రచారం నిర్వహించిన  చంద్ర బాబు అనంతరం బీరంగూడ, రామచంద్రాపురం, లింగంపల్లి మీదుగా చందానగర్ వరకు జరిగిన రోడ్ షోలో పాల్గొన్నారు.. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...