‘టీ...సమోసా..బిస్కెట్’. ఇది కొత్తగా వచ్చే సినిమా పేరు. దర్శకుడైన బాబ్జీ పీపుల్స్ థియేటర్ అనే సంస్థను స్థాపించి నిర్మాతగా మారి తొలి చిత్రంగా ‘టీ..సమోసా..బిస్కెట్’ను అందిస్తున్నారు. ‘‘పేదవాడికి నగరంలో చోటేలేదన్న, ఇరానీ హోటల్ ఒక్కటే అండగా ఉందన్న’’ అన్న ఒక పాట పంక్తుల సారాంశమే ఈ చిత్రకథ. శ్రీహరి పాత్ర ఇందులో వెరైటీగా ఉంటుంది. మూడు షెడ్యూల్స్ తో చిత్రం పూర్తవుతుందని దర్శక నిర్మాత బాబ్జీ తెలిపారు.ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ సన్నివేశాన్ని ఆదివారం ఉదయం రామానాయుడు స్ట్టూడియోలో చిత్రీకరించారు. నరేష్, ధర్మవరపు, ఎవిఎస్, నల్లూరి వెంకటేశ్వర్లు (అన్న), అలీ, షాయాజీ షిండే, తనికెళ్ల భరణి, నాజర్, కొండవలస, బాబూమోహన్, చాణక్య, ధన్‌రాజ్, చిట్టిబాబు, కమల్, మునిచంద్ర, శోభనా నాయుడు, వాహిని, కవిత, సిరివెనె్నల, అనిల్ మధుచక్రవర్తి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చక్రి, ఎడిటింగ్: మోహన్ రామారావు, కెమెరా: వి.శ్రీనివాసరెడ్డి, రచన, నిర్మాత, దర్శకత్వం: బాబ్జీ.