ఎంపీగా జగన్ ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ,అగస్ట్ 4: కడప ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి గా గెలుపొందిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం లోక్‌సభలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఉదయం 11.01 గంటలకు తెలుగులో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. స్పీకర్ మీరాకుమార్, ప్రతిపక్ష, విపక్ష నేతలు వైఎస్ జగన్‌కు అభినందనలు తెలిపారు. ఆయన ప్రమాణం చేస్తున్నప్పుడు విపక్ష ఎంపీలు బలచరుస్తూ స్వాగతం పలికారు. కాగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని జగన్ సతీమణి వైఎస్ భారతీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు లోక్‌సభ గ్యాలరీ నుంచి తిలకించారు.
Comments