అన్నాహజారే బాటలో కోదండరామ్
హైదరాబాద్,అగస్ట్ 29: రాష్ట్ర సాధన కోసం సామాజిక కార్యకర్త అన్నా హజారే బాటలో నడుస్తానని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ అన్నారు. అన్నా హజారే లాగా ఉద్యమించి తెలంగాణ సాధిస్తామని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సకల జనుల సమ్మెను వాయిదా వేయాలనే మంత్రి శ్రీధర్ బాబు సూచన అర్థరహితమని ఆయన అన్నారు. వచ్చే నెల 6వ తేదీ నుంచి సకల జనుల సమ్మెను ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. 2011 లోనే తెలంగాణ సాధించేలా కార్యాచరణను రూపొందిస్తామని ఆయన చెప్పారు.
Comments