Monday, August 1, 2011

హమ్మయ్య...అమెరికా...

వాషింగ్టన్ ,అగస్ట్ 2:   ‘రుణ పరిమితి సంక్షోభం’ నుంచి అమెరికా తప్పించుకుంది. ఆర్థిక సంక్షోభం అంచు నుంచి, అంతర్జాతీయంగా పరువుపోయే గడ్డుస్థితి నుంచి బయటపడింది. రుణపరిమితి పెంచుకునే, ద్రవ్యలోటును తగ్గించుకునే ప్రతిపాదనలపై అధికార డెమోక్రాట్లు, విపక్ష రిపబ్లికన్లు ఒక అంగీకారానికి వచ్చారు. దాంతో ఒబామా సర్కారు ఆగస్టు 2 తరువాత ప్రభుత్వ ఖర్చులకు చెల్లింపులు జరపలేని నిస్సహాయత నుంచి విజయవంతంగా గట్టెక్కింది. వచ్చే పదేళ్లలో రెండు దశల్లో మరో 2.4 లక్షల కోట్ల రుణపరిమితి పెంపునకు ఇరుపార్టీలు అంగీకరించాయి. అదే కాలంలో అంతే మొత్తంలో లోటును తగ్గించుకోవాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపాయి. తాజా నిర్ణయాలతో అమెరికా ఆర్థికపరిస్థితిలోని అస్థిరత తొలగుతుందన్న ఆశాభావాన్ని ఒబామా వ్యక్తంచేశారు. ‘ఈ ఒప్పందం ద్వారా.. దివాలా పరిస్థితి నుంచి అమెరికా తప్పించుకోగలుగుతుంది. బిల్లుల చెల్లింపు సాధ్యమవుతుంది. బాధ్యతాయుతమైన పద్ధతుల్లో లోటును తగ్గించుకోగలుగుతాం. ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకునేలా, వృద్ధి రేటు పెరిగేలా చర్యలు తీసుకోగలుగుతాం’ అని ధీమా వ్యక్తంచేశారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...