'గబ్బర్‌సింగ్' గా పవన్ కళ్యాణ్
సల్మాన్ తో హిందీలో హిట్టయిన 'దబాంగ్' చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా 'గబ్బర్‌సింగ్' గా రీమేక్ అవుతోంది. పవన్‌కల్యాణ్, శ్రుతిహాసన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కొత్త పోస్టర్ని కూడా విడుదల చేసారు. ఈ చిత్రంలో పొగరు పోలీసు అధికారి గా పవన్ కనిపించనున్నారు. చాలా కేర్ లెస్ గా కనిపించే మాస్ లుక్ తో ఉన్న క్యారెక్టర్ ని ప్రతిబింబించేలా ఈ స్క్రిప్టుని ని రూపొందించారు. ‘మిరపకాయ్’ వంటి మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్’ చిత్రాన్ని, పెద్ద హిట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' లో సిక్స్ ప్యాక్ తో తన భిమానులు, తెలుగు ప్రేక్షకుల ఎదుటకు రానున్నాడు. కొమరం పులి తర్వాత పద్దతి మార్చుకుని ఫాస్ట్ గా సినిమాలు కంప్లీట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ‘కాళి’ కూడా పూర్తి కావచ్చింది. తమిళ డైరెక్టర్ విష్ణు వర్థన్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో పవన్ ఒక డిఫరెంట్ షేడ్ ను చూపించబోతున్నాడు. ఇండియాలో డిఫరెంట్ లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్ లో హై ఎక్స్ పెక్టేషన్స్ వున్నాయి.

Comments