కండలవీరుని పై శ్రియ కన్ను...!
దాదాపు పదేళ్ల క్రితం తెరంగ్రేటం చేసిన శ్రియ దక్షిణాదిన మెగాస్టార్, రజినీకాంత్ తో పాటు అందరు అగ్రహీరోల సరసన నటించి, ఓ వెలుగు వెలుగి... హాట్ లేడీగా పేరు తెచ్చుకుంది. అయితే సౌత్ లో తనకు క్రేజ్ తగ్గిందన్న వాస్తవాని గుర్తించిన ఈ భామ బాలీవుడ్ బాట పట్టింది. ఈ మధ్య బాలీవుడ్ లో ఏ కార్య క్రమం జరిగినా అక్కడ దర్శనమిస్తూ దర్శకులు, హీరోల కళ్లలో పడటానికి యథాశక్తి ప్రయత్నాలు చేస్తోందిట. మరో వైపు హాట్ హాట్ ఫోటో షూట్లతో యువతలో తనపై వేడి తగ్గకుండా జాగ్రత్త పడుతోందని చెబుతున్నారు. అయినా పెద్దగా చాన్సులు దక్కడమే లేదు. ఇండస్ట్రీలో ఎవరో ఒక స్టార్ హీరోతో చనువు పెంచుకుని సినిమా అవకాశాలు దక్కించుకునే దిశగా ఇప్పుడు అడుగులు వేస్తోంది. క్రతినా, సోనాక్షి, ఆసిన్ లాంటి వారికి లైఫ్ ఇచ్చిన సల్మాన్ అయితేనే తనకు కరెక్ట్ అని భావించిందేమో ... ఇప్పుడు శ్రియ అతగాడికి బాగా దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు మొదలెట్టిందని తాజా సమాచారం.

Comments