పార్లమెంట్‌కు టీ-కాంగ్రెస్ ఎంపీలు గైర్హాజరు
న్యూఢిల్లీ,అగస్ట్ 1: తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ సమావేశాలకు గైర్హాజరు అయ్యారు. తెలంగాణపై తమకు స్పష్టమైన వైఖరి ప్రకటించేవరకూ సమావేశాలకు హాజరు కాకుడదని ఎంపీలు నిర్ణయించారు. ఆజాద్ తో సమావేశం అయిన తర్వాతే పార్లమెంట్ సమావేశాలకు హాజరుపై నిర్ణయం తీసుకుంటామని కేకే తెలిపారు. కాగాటీడీపీ తెలంగాణ ఎంపీలు కూడా పార్లమెంట్‌కు డుమ్మా కొట్టారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అయ్యాయి. లోక్‌సభ ప్రారంభం కాగానే పధానమంత్రి మన్మోహన్‌సింగ్ సభకు కొత్త మంత్రులను పరిచయం చేశారు. అనంతరం మృతి చెందిన మాజీ లోక్‌సభ ఎంపీలకు స్పీకర్ మీరాకుమార్ సంతాపం ప్రకటించారు. తర్వాత సభను స్పీకర్ మంగళవారానికి వాయిదా వేశారు. రాజ్యసభలో అవినీతిపై బీజేపీ చర్చకు పట్టుబట్టడంతో రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ సభను మంగళవారానికి వాయిదా పడింది. వేశారు. అంతకు ముందు ఇటీవలి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన అరుణాచల్‌ప్రదేశ్ సీఎం ఖండూ, పుట్టపర్తి సత్యాసాయి బాబాతో పాటు, మాజీ రాజ్యసభ్యుల మృతికి రాజ్యసభ సంతాపం తెలిపింది.
Comments