 |
| గాలి జనార్దన్ రెడ్డి |
బెంగళూరు,అగస్ట్ 8: యడ్యూరప్ప మంత్రివర్గంలో కీలకంగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డి సోదరులకు కొత్త ముఖ్యమంత్రి సదానంద గౌడ షాక్ ఇచ్చారు. సదానంద గౌడ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికైన నేపథ్యంలో సోమవారం సాయంత్రం కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఈ మంత్రివర్గంలోకి గాలి సోదరులతో పాటు వారి సన్నిహితుడు శ్రీరాములును సైతం సదానంద గౌడ తీసుకోలేదు. సదానంద గౌడ 21 మంది మంత్రులతో తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప వర్గానికే ప్రాధాన్యం లభించింది. యడ్యూరప్ప వర్గానికి చెందిన 12 మందికి సదానంద మంత్రివర్గంలో చోటు కల్పించారు. ముఖ్యమంత్రి పదవి కోసం తనపై పోటీ పడిన జగదీశ్ షెట్టర్ వర్గానికి చెందిన 9 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
Comments