Friday, August 12, 2011

సకలజనుల సమ్మెకు సవరింపు

సెప్టెంబర్ 6 నుంచి అసలు సమ్మె 
హైదరాబాద్, ఆగస్టు 12: ఈ నెల  17న ప్రారంభమవ్వాల్సిన సకలజనుల సమ్మె సెప్టెంబర్ 6 నుంచి మొదలవుతుందని తెలంగాణ రాజకీయ జేఏసీ ప్రకటించింది. శ్రావణమాసం పూజలు, రంజాన్ ఉపవాస దీక్షల నేపథ్యంలో ఆయా వర్గాల మనోభావాలను గౌరవిస్తూ కార్యక్రమాల్లో మార్పులు చేసుకున్నట్టు  జేఏసీ చైర్మన్ కోదండరాం గురువారం విలేకరులకు తెలిపారు. ‘‘హిందూ, ముస్లింల విజ్ఞప్తులు, పార్టీలు, ప్రభుత్వ వైఖరులు తదితరాలపై సమగ్రంగా చర్చించి, సమ్మెలో చిన్న మార్పులు చేయాలని నిర్ణయించాం. ఈ 17న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా చేస్తాం. జిల్లా స్థాయిలో ప్రచార యాత్రలు, బస్సు యాత్రలు, సభలను 17 తర్వాత కూడా చేపడతాం. సెప్టెంబర్ 5న కరీంనగర్ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగసభ నిర్వహిస్తాం. వివిధ కార్యక్రమాలతో భారీగా ప్రజాందోళనలు జరుగుతాయి. సెప్టెంబర్ 6 నుంచి సకల జనుల సమ్మెలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు సమ్మె ద్వారా భాగస్వాములవుతారు. లాయర్లు, డాక్టర్లు తదితరులు విధులు బహిష్కరిస్తారు. తర్వాత సమ్మె తీవ్రరూపు దాలుస్తుంది’’ అని వివరించారు. సమ్మెను వాయిదా వేయలేదని, అందులో భాగంగానే అన్ని కార్యక్రమాలూ జరుగుతాయని చెప్పారు. ‘‘ఉద్యమానికి విరామం లేదు, రాష్ట్ర సాధన దాకా నిరంతర పోరాటం సాగుతుంది. రాజధాని నుంచి మారుమూల పల్లెలదాకా ఇంకా ప్రజాచైతన్యం రావాలి. వారంతా వీలైనన్ని రూపాల్లో సమ్మెలో భాగస్వాములయ్యేలా సమాయత్తం చేస్తాం. ఈ నెల 17 నుంచి ‘గ్రామాలకు తరలండి’ అనేలా కార్యక్రమాలుంటాయి’’  అని చెప్పుకొచ్చారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...