విప్రో నుంచి డెల్‌కు సీనియర్ల వలస
బెంగళూరు,అగస్ట్,5: : ఐటి ఎగుమతుల్లో మూడవ అతిపెద్ద సంస్థ విప్రో నుంచి సీనియర్ల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. గడచిన మూడు నెలల్లో నలుగురు ఉన్నతాధికారులు సంస్థకు రాజీనామా చేయగా, వారిలో ముగ్గురు డెల్‌లో చేరారు. జనవరిలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సురేష్ వస్వానీని తొలగిస్తూ, ఆయన స్థానంలో టికె కురియన్‌ను నియమిస్తున్నట్టు విప్రో చీఫ్ అజీం ప్రేమ్‌జీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత వస్వానీ డెల్ ఇండియా హెడ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆపై విప్రోలో సీనియర్ల నుంచి జూనియర్ల వరకూ ఎంతో మంది డెల్‌కు వలస వెళ్ళారు. గడచిన తొలి త్రైమాసికంలో విప్రో నికర లాభం జనవరి త్రైమాసికంతో పోలిస్తే 3 శాతం తగ్గిన సంగతి తెలిసిందే.
Comments