Tuesday, August 16, 2011

శ్రీరామరాజ్యం పాటలు రెడీ...


 శ్రీరామరాజ్యం సినిమా ఆడియో ఆవిష్కరణ భద్రాద్రి దివ్య క్షేత్రంలో సోమవారం రాత్రి కన్నుల పండువగా జరిగింది. హీరో నందమూరి బాలకష్ణ సీడీని ఆవిష్కరించారు. తొలి సీడీని శ్రీసీతారామ చంద్రస్వామివారి ఆలయ ఇన్‌చార్జ్ ప్రథానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు, అర్చకులు కోట్జకృష్టమా చార్యులకు అందజేశారు. డా.అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడుతూ ‘సెక్స్, వయలెన్స్ రాజ్యమేలుతున్న నేటిరోజుల్లో ఇలాంటి సినిమా చూస్తారా? అని నిర్మాతతో సందేహం వెలిబుచ్చాను. నా భార్య అన్నపూర్ణమ్మకు ఆరోగ్యం బాగలేనప్పటికీ,తనని ఒప్పించి మరీ ఈ సినిమాలో వాల్మీకి పాత్ర చేశాను. ఎన్‌టిఆర్ అన్ని రకాల పురాణ పాత్రలను అలవోకగా చేశారు. భారతదేశంలో అలాంటి పాత్రలు ఆయన తర్వాత ఎవరూ చేయలేరు. సింహం కడుపున సింహం పుడుతుంది అన్నట్లు ఈ పాత్రకు బాలకృష్ణ సమరసింహుడిగా సరిపోయాడు. ఇక సీతగా నయనతారను చూసినప్పుడే ఈ సినిమా సక్సెస్ అనుకున్నాను. ’ అన్నారు. బాలకృష్ణ మాట్లాడుతూ ‘రాముడు నడయాడిన ఈ భద్రాద్రిలో ఈ ఫంక్షన్ జరుపుకోవడం మా అదృష్టం. ఇప్పటి కాల పరిస్థితులకు రామాయణం అత్యవసరం. ఆదర్శ ప్రభుత్వం అంటే ఎవరైనా రామరాజ్యమనే చెబుతారు" అన్నారు. నయనతార మాట్లాడుతూ ‘ఈ సినిమాలో ఇంతమంది లెజెంDsతో కలిసి పనిచేసినందుకు ఎంతో గర్వంగా ఉంది’ అన్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...