గృహ నిర్బంధం లో అన్నాహజారే

న్యూఢిల్లీ,అగస్ట్ 16:  : అవినీతికి వ్యతిరేకంగా పటిష్టమైన జన్ లోక్‌పాల్ బిల్లు కోసం కేంద్రంపై అమీతుమీకి సిద్ధమైన సామాజికవేత్త, గాంధేయవాది అన్నాహజారేను మంగళవారం ఉదయం ఢిల్లీ పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించక ముందే పోలీసులు హజారేతో పాటు, అరవింద్ కేజ్రీవాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో హజారే మద్దతుదారులు పోలీసులను అడ్డుకున్నారు. హజారేను రహస్య ప్రాంతానికి తరలించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఈ సందర్భంగా హజారే మాట్లాడుతూ,  అవినీతిభూతం ఏంటనేది నేడు భారతీయులందరికీ తెలిసిందన్నారు. ఇది దేశమార్పు కోసం జరుగుతున్న ఉద్యమమని, మార్పు జరగనంతవరకూ ప్రజాస్వామ్యం, గణతంత్రం రానట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. తన నిర్బంధం వల్ల ఉద్యమం ఆగదని, తన తర్వాత ఉద్యమాన్ని నడిపేందుకు క్రేజివాల్, కిరణ్‌బేడీ, హెగ్డే, భూషణ్ ఉన్నారన్నారు. జైలులో కూడా తాను ఉద్యమాన్ని కొనసాగిస్తానని హజారే తెలిపారు. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు