Saturday, August 20, 2011

నా బిడ్డ పై సిబిఐ సోదాల వెనుక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం లేదా?

ప్రధానమంత్రి కి లేఖలో విజయమ్మ ఆక్రోశం  
హైదరాబాద్ ,అగస్ట్ 20:  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు విజయమ్మ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్కు లేఖ రాశారు. తమ కుమారుడు వైఎస్ జగన్మోహన రెడ్డి ఆస్తులకు సంబంధించి సిబిఐ సోదాల వెనుక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం లేదా? అని ఆమె ఆ లేఖలో ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని వదిలివేస్తే అవినీతిపరులవుతారా? నిజాయితీ లేనివాళ్లవుతారా? అని ఆమె అడిగారు. కేంద్ర ప్రభుత్వాన్ని నియంత్రిస్తున్న శక్తుల నుంచి దేశాన్ని కాపాడండని ఆమె ప్రధానికి విజ్ఞప్తి చేశారు. భారమైన హృదయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున తాను వ్యక్తిగతంగా ఈ లేఖ రాస్తున్నట్లు ఆమె తెలిపారు. అయిదు పేజీల సుదీర్ఘమైన లేఖను ఆమె రాశారు. వేలాది కేసులు పెండింగ్లో ఉన్నప్పటికీ జగన్ ఆస్తుల వ్యవహారంలో సిబిఐ వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోందని ఆమె పేర్కొన్నారు. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి విధేయుడుగా ఉన్నప్పుడు నిజాయితీపరుడుగా ఉన్న జగన్ ఇప్పుడు అవినీతిపరుడైపోయాడా అని ఆమె ప్రశ్నించారు. జగన్కు లభిస్తున్న ప్రజాధరణను దెబ్బతీయడానికే ఈ దాడులని స్సష్టమవుతోందని ఆమె పేర్కొన్నారు. అన్నా హజారే లాంటి వ్యక్తిపైనే అవినీతి ఆరోపణలు చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంటే ఏమైనా చేస్తారన్న భావన ప్రజలలో వ్యక్తమవుతోందన్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...