Sunday, August 28, 2011

దీక్ష విరమించిన హజారే...

 న్యూఢిల్లీ .అగస్ట్ 28:  అవినీతిని సమర్థవంతంగా అడ్డుకునే జన లోక్‌పాల్ బిల్లు కోసం  12 రోజుల పాటు చేసిన నిరాహార  దీక్షను  అన్నా హజారే  ఆదివారం ఉదయం  విరమించారు.జాతి యావత్తు ఆయన వెంట నిలవడంతో అవినీతి నిరోధక బిల్లు తెచ్చేందుకు యూపీఏ ప్రభుత్వం  ఒప్పుకుంది.  పెద్ద సంఖ్యలో  హజారే మద్దతుదారులు రాంలీలా మైదాన్‌కు చేరుకుని హజారే ను అభినందించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సిటిజన్ చార్టర్లను అమలుచేయాలని,  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులందరినీ లోక్‌పాల్ కిందకు తేవాలని,  లోక్‌పాల్ తరహాలో రాష్ట్రాల్లో లోకాయుక్తలను ఏర్పాటు చేయాలని  అన్నా హజారే విదించిన మూ డు   షరతులను శనివారం ప్రత్యేకంగా సమావేశమైన పార్లమెంటు ఉభయసభలూ ఆమోదించాయి. లోక్‌పాల్‌పై అన్నాహజారే షరతులకు పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందన్న వార్త తెలియగానే.. హజారే దీక్ష చేస్తున్న రామ్‌లీలా మైదానంలో సంబరాలు మిన్నంటాయి. అన్నా మద్దతుదారులు విజయోత్సవాలు చేసుకున్నారు. త్రివర్ణ పతాకాలు చేతబూని పరస్పరం ఆలింగనాలు చేసుకుంటూ అభినందనలు తెలుపుకున్నారు. పార్లమెంటు తీర్మానం ప్రతిని, ప్రధానమంత్రి రాసిన లేఖను.. కేంద్రమంత్రి, చర్చల్లో ప్రభుత్వ ప్రతినిధి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ శనివారం రాత్రి తీసుకువచ్చి హజారేకు అందజేశారు. ఈ సందర్భంగా హజారే వేలాది మంది మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘ఈ రోజు జన్‌లోక్‌పాల్‌కు సంబంధించిన మూడు అంశాలు లోక్‌సభ ఆమోదం పొందాయి. సహకరించిన పార్లమెంటు సభ్యులందరికీ అభినందనలు తెలుపుతున్నాను. జన్‌లోక్‌పాల్‌లో ఇప్పటి వరకు సగం విజయం సాధించాం. మిగిలిన సగం విజయాన్ని సాధించాల్సి ఉంది...అని అన్నారు హజారే.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...