Saturday, August 20, 2011

రాహుల్ సమక్షంలో కాంగ్రెసు తీర్థం పుచ్చుకు న్న చిరంజీవి

న్యూఢిల్లీ,అగస్ట్ 20:  రాజీవ్ గాంధీ జయంతి రోజు ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కాంగ్రెసు నేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెసు తీర్థం పుచ్చుకున్నారు. దీంతో మూడేళ్ల ప్రజారాజ్యం ప్రస్థానం ముగిసింది. చిరంజీవికి కాంగ్రెసు కండువా కప్పి కాంగ్రెసు పార్టీలోకి ఆహ్వానించారు. సోనియా నాయకత్వంలోని కాంగ్రెసు పార్టీలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చిరంజీవి చెప్పారు. రాష్ట్ర కాంగ్రెసు నాయకులు పలువురు ఈ కార్యక్రమానికి వచ్చారు.  చిరంజీవి జాతీయ పార్టీలో చేరడం శుభపరిణామమని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ అన్నారు. ఇక చిరంజీవి తమ పార్టీలో అంతర్భాగమని ఆయన అన్నారు. తాను కాంగ్రెసులో  చేరడం మరుపురాని ఘట్టమని చిరంజీవి అన్నారు. అయితే ఈ సభ లో  రాహుల్ గాంధీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చిరంజీవి పార్టీలో చేరడం పూర్తయిన తర్వాత ఆయన వెళ్లిపోయారు.   తాను కాంగ్రెసులో చేరిన సందర్భంలో సోనియా లేకపోవడం అసంతృప్తి కలిగించిందని చిరంజీవి అన్నారు. పార్టీ ఏ బాధ్యతను అప్పగించినా శిరసా వహిస్తానని ఆయన చెప్పారు.  రాహుల్ నాయకత్వం దేశానికి అవసరమని ఆయన అన్నారు.
చిరంజీవి కాంగ్రెసులో చేరిన కార్యక్రమానికి గులాం నబీ ఆజాద్‌తో పాటు జనార్దన్ ద్వివేది, ఎస్ జైపాల్ రెడ్డి, అహ్మద్ పటేల్, కెవిపి రామచంద్ర రావు,  వి హనుమంతరావు, కేంద్ర మంత్రి పళ్ళం రాజు, పలువురు పి.ఆర్.పి. నేతలు హాజరయ్యారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...