Friday, August 5, 2011

లోక్‌సభలో లోక్‌పాల్ బిల్లు

ప్రధానిని మినహాయించడంపై బీజేపీ  నిరసన
బిల్లు ప్రతులను తగలెట్టిన అన్నా హజారే
న్యూఢిల్లీ,అగస్ట్,5: : విపక్షాల నిరసనల మధ్య  కేంద్ర ప్రభుత్వం లోక్‌పాల్ బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. లోక్‌పాల్ పరిధి నుంచి ప్రధానిని మినహాయించడంపై బీజేపీ సహా ఎన్డీయే పక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. మరోవైపు ఇదే కారణంతో అన్నా హజారే, ఆయన మద్దతుదారులు బిల్లు ప్రతులను తగులబెట్టారు. లోక్‌పాల్ బిల్లును కేంద్ర సిబ్బంది శాఖ మంత్రి నారాయణస్వామి  లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బిల్లు ప్రవేశపెట్టేందుకు ముందే ఈ అంశంపై మాట్లాడేందుకు విపక్షనేత సుష్మా స్వరాజ్‌కు స్పీకర్ మీరా కుమార్ అనుమతి ఇచ్చారు. క్రిమినల్ చట్టం, అవినీతి నిరోధక చట్టాల నుంచి ప్రధానికి ఎలాంటి మినహాయింపు లేనప్పుడు లోక్‌పాల్ నుంచి ఎందుకు మినహాయించారంటూ సుష్మా ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం అందరూ సమానులేనని, కేంద్ర మంత్రులందరినీ లోక్‌పాల్ పరిధిలోకి తెచ్చి, ప్రధానిని మాత్రం ఎందుకు మినహాయించారో అర్థం కావడం లేదని అన్నారు. ప్రణబ్ ముఖర్జీ హోంశాఖ స్థాయీ సంఘం చైర్మన్‌గా ఉన్నప్పుడు ప్రధానిని లోక్‌పాల్ పరిధిలోకి తెచ్చేందుకు అంగీకరించారని గుర్తు చేశారు. అప్పట్లో తాను ప్రధానిని లోక్‌పాల్ పరిధిలోకి తేవడానికి మద్దతు పలికిన మాట నిజమేనని ప్రణబ్ అన్నారు. హోంశాఖ స్థాయీ సంఘం చైర్మన్‌గా ఉన్నప్పుడు 2002 ఫిబ్రవరి 16న లోక్‌పాల్ బిల్లును సభకు సమర్పించానని, ఆ తర్వాత రెండేళ్లు ఎన్డీయే సర్కారే అధికారంలో ఉన్నా, ఎందుకు ఆమోదించలేకపోయారని ఆయన ప్రశ్నించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...