తడిసి ముద్దయిన ముంబై
ముంబై,అగస్ట్ 29: వర్షంతో ముంబై నగరం సోమవారం తడిసి ముద్దయింది. ప్రజలు కార్యాలయాలకు బయలుదేరే సమయంలో వర్షం అంతరాయం కలిగించింది. సెంట్రల్ లైన్‌లోని బైకుల్లా, దాదర్, థానే వంటి ప్రధాన స్టేషన్లను ట్రాక్‌లపై నీరు చేరడంతో మూసివేశారు. రోజుకు 30 లక్షల మంది ప్రయాణించే పశ్చిమ లైన్‌లో రైళ్లు ఆలస్యంగా నడిచాయి. సోమవారం ఉదయం 11 గంటలకు బయలుదేరాల్సిన విమానాలు 20 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరాయి. . నగరంలోని మున్సిపల్ పాఠశాలలను మూసేశారు. వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ పరిశోధనా శాఖ అంచనా వేస్తోంది. వర్షాలు వచ్చిన ప్రతిసారీ ముంబై నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.
Comments