తమిళనాడు గవర్నర్‌గా రోశయ్య ప్రమాణ స్వీకారం
చెన్నై: తమిళనాడు గవర్నర్‌గా కొణిజేటి రోశయ్య ప్రమాణ స్వీకారం చేశారు. రోశయ్య ప్రమాణస్వీకార కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, మంత్రివర్గ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రోశయ్యకు జయలలిత శుభాకాంక్షలు తెలిపారు. రోశయ్య చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇక్బాల్ ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం అనంతరం ఎంపీ సుబ్బిరామిరెడ్డి, మంత్రి పితాని సత్యనారాయణ, జేడీ శీలం, పీ. సుశీల, విజయకాంత్, ఆనం రామ్‌నారాయణరెడ్డి, శంకర్‌రావు, శశిధర్‌రెడ్డి, కేవీపీ, నన్నపనేని, బొత్స సత్యనారాయణ, చిరంజీవి పుష్పగుచ్ఛాలు అందచేసి శాలువాలతో సన్మానించారు.
Comments